Madhya Pradesh : ఉద్యోగం పోతుందని ఆత్మహత్యకు పాల్పడ్డ మేనేజర్ ..!

Madhya Pradesh : ఉద్యోగం పోతుందని ఆత్మహత్యకు పాల్పడ్డ మేనేజర్ ..!

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఫిబ్రవరి 25న పేటీఎం ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లసుడియా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తారేష్ సోని తెలిపిన వివరాల ప్రకారం, మేనేజర్ గౌరవ్ గుప్తా (40) ఇండోర్‌లోని స్కీమ్ నంబర్ 78లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంపెనీ మూతబడితే ఉద్యోగం పోతుందనే భయంతో గౌరవ్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఈ కేసుపై ఇంకా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితేంద్ర పట్వారీ మాట్లాడుతూ, Paytm మూసివేస్తే ఉద్యోగం పోతుందనే భయంతో గౌరవ్ మరణించాడని, Paytm సంక్షోభానికి బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ కేసులో ప్రమేయమున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆయన ఎక్స్‌ పోస్ట్‌లో ప్రశ్నించారు.

"కార్పోరేట్ విరాళాల పేరుతో ఈ సంక్షోభం కూడా పరిష్కారమవుతుందా? బీజీపీ ఖజానాలో చాలా డబ్బు ఉందా ?" అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Paytm వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తన కస్టమర్ ఖాతాలలోకి తదుపరి క్రెడిట్‌లను ఆమోదించడానికి RBI నిర్దేశించిన మార్చి 15 గడువు కంటే ముందు సోమవారం Paytm పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు.

Tags

Read MoreRead Less
Next Story