Drugs Case : బాలానగర్‌లో భారీగా డ్రగ్స్ సీజ్

Drugs Case : బాలానగర్‌లో భారీగా డ్రగ్స్ సీజ్
X

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న యువకుడిని ఎస్టీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు కూకట్ పల్లి వడ్డేపల్లి ఎన్ క్లేవ్ ప్రాంతంలో షేక్ ఫారుక్ అనే యువకుడి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 4.1 గ్రాముల ఏండిఎంఎ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్నారు.

23 ఏళ్ల షేక్ ఫారుక్ బెంగూళూరు నుంచి దొంగచాటుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ ను తీసుకొని అమ్ముతున్నాడు. ఒక గ్రామ్ 12వేలకు విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎండిఎంఎ విలువ రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Tags

Next Story