Times Tower Fire Accident : ముంబై టైమ్స్ టవర్ లో భారీగా చెలరేగిన మంటలు..

Times Tower Fire Accident : ముంబై టైమ్స్ టవర్ లో భారీగా చెలరేగిన మంటలు..
X

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టైమ్స్‌ టవర్‌లో భారీగా మంటలు చెలరేగాయి. ఉదయం ఆరున్నర గంటలకు లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఉన్న టైమ్స్‌ టవర్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పైఅంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

9 ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టైమ్స్ టవర్ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఒకటి. బృహన్ ముంబై మున్సిపాలిటీ ఈ సంఘటనకు సంబంధించి తాజా అప్ డేట్ ను విడుదల చేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. మంటలను ఆర్పే పని జరుగుతోందని వెల్లడించింది. ఈ ఘటనతో స్థానికంగా అలజడి రేగింది.

Tags

Next Story