West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో మిస్టరీ మరణాలు.. కల్తీ సారానే కారణమా..?

X
West Godavari: పశ్చిమగోదావరిజిల్లా జంగారెడ్డిగూడెంలో గత రెండురోజులుగా 15మంది మృతిచెందడగం తీవ్రకలకలం రేపుతోంది. ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్టుండి అస్వస్థతకు గురై మృత్యువాత పడటం మిస్టరీగా మారింది. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చేరిన గంటలోనే పలువురు మృతిచెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరణించిన వారిలో ఎక్కువమంది మద్యం అలవాటు ఉన్నవారే.
కల్తీసారా కారణంగానే తమ వాళ్లు చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో సారా రహిత జిల్లాగా పేరుగాంచిన పశ్చిమగోదావరిజిల్లాలో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రతి ఊరు, వీధుల్లో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై ఎస్‌ఈబీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
