Suicide : బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

Suicide : బిడ్డతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య
X

క్షణికావేశంలో కూతురితో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సారంగాపూర్ మండలం అర్చప ల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక కుటుంబంలో గత కొంత కాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నా యి. ఈక్రమంలో గొడవలు భరించలేక తన కూతురు సాహితీ (4) తో కలిసి తల్లి మౌనిక ఇవాళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీస్ ను బావిలో నుంచి బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిచారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త వరకట్న వేధింపులతోనే మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Tags

Next Story