కూతురిని ప్రేమించాడని.. కాళ్లు, చేతులు నరికేశారు!

కూతురిని ప్రేమించాడని.. కాళ్లు, చేతులు నరికేశారు!
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో పంచాయతీ పెట్టారు.

తన కుమార్తెని ప్రేమించి, నిత్యం ఫోన్ లో మాట్లాడుతున్నాడని ఓ యువకుడి కాళ్లు, చేతులు నరికేశారు కుటుంబ సభ్యులు.. ఈ దారుణమైన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే వెంకటేశ్‌ అనే యువకుడికి అదే గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న యువతితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో వెంకటేశ్‌ను పిలిపించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. అప్పటినుంచి గ్రామానికి దూరంగా ఉంటూ వస్తున్న వెంకటేష్.. ఆ యువతితో తరుచు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకి తెలియడంతో గత రాత్రి వెంకటేష్ ని మాట్లాడాలంటూ నమ్మకంగా ఆ గ్రామానికి పిలిపించారు.

ఆ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ యువతి తండ్రి భాస్కర్ రావు, మరో అయిదుగురు బంధవులు కలిసి వెంకటేశ్‌పై మారణాయుధాలతో దాడి చేసి కాళ్లు, చేతులు నరికేశారు.అయితే దీనిపైన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంకటేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం నిందితులు పోలిస్ స్టేషన్ లో లొంగిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story