Murder : అరుణాచలంలో తెలుగు భక్తుడి హత్య

Murder : అరుణాచలంలో తెలుగు భక్తుడి హత్య
X

తమిళనాడులో దారుణం జరిగింది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు హత్యకు గురయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్‌ అనే వ్యక్తి శుక్రవారం వేకువజామున గిరి ప్రదక్షిణ చేస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు అతడిని ఢీకొట్టారు. కిందపడిన విద్యాసాగర్‌ యువకులతో వాగ్వాదానికి దిగారు. ఆక్రోశించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను తోటి భక్తులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. శివయ్య దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.

Tags

Next Story