ఫేస్‌బుక్ లైవ్‌లో హత్య.. శివసేన నాయకుడి కుమారుడిపై కాల్పులు
శివసేన యూబీటీ నేత కుమారుడు అభిషేక్ ఘోసల్కర్‌తో ఫేస్‌బుక్ లైవ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. అనంతరం దుండగుడు తుపాకీని తనవైపు తిప్పుకుని తనకు తాను కాల్చుకుని మరణించాడు. ఇదంతా కెమెరాలో రికార్డయింది. ఘోసల్కర్, అతనిపై దాడి చేసిన వ్యక్తీ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దహిసర్ ప్రాంతంలోని MHB కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఘోసల్కర్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసల్కర్ కుమారుడు. మారిస్ భాయ్ అని పిలవబడే మారిస్ నోరోన్హా కార్యాలయం వద్ద దాడి జరిగింది. వెబ్‌కాస్ట్ చేయబడుతున్న ఒక ఈవెంట్ కోసం ఘోసల్కర్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించారు మారిస్.
“ఇప్పుడు అభిషేక్ ఘోసల్కర్‌పై బుల్లెట్లు పేల్చారని నాకు సమాచారం అందింది... ఎన్ని రోజులు భరించాలి.. దీంతో మహారాష్ట్ర పరువు పోవడమే కాదు.. ప్రజలు కూడా భయపడుతున్నారు.. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఏర్పడింది’’ అని రాష్ట్ర మాజీ మంత్రి, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే అన్నారు.
ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన నాయకుడు మహేష్ గైక్వాడ్‌పై ఒక బిజెపి ఎమ్మెల్యే కాల్పులు జరిపిన కొద్ది రోజులకే అభిషేక్ ఘోసల్కర్ హత్య జరిగింది. దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర ప్రజలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com