Murder : రూ.30 ఆటో చార్జీ కోసం గొడవపడి హత్య

Murder : రూ.30 ఆటో చార్జీ కోసం గొడవపడి హత్య
X

ఆటో చార్జీ విషయంలో గొడవ జరగడంతో ఓ యువకుడు తన స్నేహితుడిని చంపాడు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని గోండాకు చెందిన సైఫ్ జాహిద్ అలీ, చక్కన్ అలీ స్నేహితులు. వీరు ఇటీవల ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ముంబై వెళ్లారు. అక్కడ కుర్ణా ప్రాంతంలో ఆటో రిక్షా చార్జీ చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది.

గొడవ ముదరడంతో సహనం కోల్పోయిన జాహిద్ అలీ తన స్నేహితుడు చక్కన్ అలీని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story