కూతురు లేచిపోయిందని..! తల్లిదండ్రులు సూసైడ్

తెల్లారి లేస్తే ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది. దక్షిణ కేరళలోని (Kerala) కొల్లం జిల్లాలో (Kollam District) విషాద ఘటన చోటు చేసుకుంది. కాలేజీకి వెళ్లే కూతురు ప్రియుడితో కలిసి పారిపోయిందని తెలిసి మనస్తాపానికి గురయ్యారు ఆ యువతి తల్లిదండ్రులు. పరువు పోతుందన్న భయంతో.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పావుంబకు చెందిన ఉన్నికృష్ణ పిళ్లై, ఆయన భార్య బిందుగా మృతులను గుర్తించారు. కుమార్తె ప్రేమ సంబంధంపై దంపతులు మానసికంగా కృంగిపోయారని వారి బంధువులు తెలిపారు. ఆ సంబంధాన్ని వదులుకోవాలనే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పారిపోయిందని పోలీసులు తెలిపారు.
ఆ తల్లిదండ్రులు.. కూతురు తమను వదిలి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయమై తమ బంధువులతో మాట్లాడారు. ఫిబ్రవరి 18 శనివారం రాత్రి వారు కొన్ని మాత్రలు మోతాదుకు మించి సేవించారు. తమ మృతదేహాలను చూసేందుకు తమ కూతురిని అనుమతించవద్దని సూసైడ్ నోట్ రాసి భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాత్రి బిందు మృతి చెందగా, ఆదివారం తెల్లవారుజామున పిళ్లై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిద్ర మాత్రలు మింగడంతో కిడ్నీలు కూడా పాడైనట్టు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com