Murder Case : పార్కింగ్ పంచాయితీ.. సైంటిస్ట్ ను చంపేశారు.

పార్కింగ్ పంచాది ఓ సైంటిస్ట్ ప్రాణం తీసింది. మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో పనిచే స్తున్న డాక్టర్ అభిషేక్ స్వరంకర్ (39) సెక్టార్ 67లోని తాను అద్దెకు ఉంటున్న ఇంటి సమీపంలో పార్కింగ్ పై జరిగిన వివాదం హత్యకు కారణమైంది. జార్కండ్ లోని ధన్ బాద్ కు చెందిన స్వరంకర్ స్విట్జర్ లాండ్ లో పనిచేసి ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చారు. ఐఐఎస్ఈఆర్ లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ గా విధులు నిర ర్తిస్తున్నారు. ఆయన ఇటీవలే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. ఆయన సోదరి తన కిడ్నీలలో ఒకదాన్ని దానం చేసింది. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం.. కొంత మంది స్థానికులు, వారిలో మోంటి అనే వ్యక్తి తన బైక్ దగ్గర నిలబడి ఉన్నాడు. అభిషే ఆ తర్వాత ద్విచక్ర వాహనం వద్దకు వెళ్లి దానిని తొలగిస్తుండగా మోంటీ డాక్టర్ స్వరంకర్ ను అడ్డుకొని నేలపైకి బాది కొడుతుండగా కుటుంబ సభ్యులు జోక్యం చేసుకొని మోంటీని దూరంగా లాగుతారు. ఇరుగు పొరుగు వారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చేలోపు డాక్టర్ స్వరంకర్ నేలపై పడి ఉంటాడు. ఆస్పత్రికి తరలించగా స్వరంకర్ మరణించినట్టు ధ్రువీకరించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మోంటీ అనే వ్యక్తిపై హత్య కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com