Padma Shri Award : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చెఫ్ కన్నుమూత

Padma Shri Award : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చెఫ్ కన్నుమూత
X

పద్మశ్రీ అవార్డు గ్రహీత, చెఫ్‌ ఇంతియాజ్‌ ఖురేషీ (Kureshi) (93) ఫిబ్రవరి 16న తెల్లవారుజామున మరణించారు. ఐటీసీ హోటల్స్‌లో (ITC Hotels) ఖురేషీ మాస్టర్‌ చెఫ్‌గా ఉన్నారు. 1931లో లక్నోలోని చెఫ్‌ల కుటుంబంలో జన్మించిన ఖురేషీ.. దమ్‌ ఫుఖ్త్‌ వంటకంతో ప్రశంసలు అందుకున్నారు.

2015లో ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖురేషీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బిర్యానీ అంటూ ఏదీ లేదని.. అన్నీ పులావ్‌లు మాత్రమేనన్నారు. ఇక ఆయన మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు.

Tags

Next Story