Renukaswamy : కరెంట్ షాక్ ఇచ్చి రేణుకాస్వామికి చిత్రహింసలు!
హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడికి కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించారని తెలిసింది. బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయట. రేణుకా స్వామిపై మొదట పవిత్రా గౌడనే దాడి చేసినట్లు తేలింది.
రేణుకాస్వామిపై మొదట పవిత్రాగౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని ఆమె కాళ్లపై పడి వేడుకొన్నా.. ఆమె కొట్టిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. పవిత్రా, దర్శన్‌తోపాటు ఇతర నిందితులు వాడిన పలు వస్తువులతోపాటు దుస్తులనూ స్వాధీనం చేసుకున్నారు.
దుస్తులపై ఉన్న రక్తం మరకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. మరోవైపు హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్ దేవరాజ్ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడంతో.. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com