అనంతపురం : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం

అనంతపురం : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం
Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి శివారులోని 44వ జాతీయ రహదారిపై ఓ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఐదుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందినవారిగా గుర్తించారు. వీళ్లంతా పెద్దపడుగూరు మండలంలోని కొట్టాలపల్లికి పత్తి కోత కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఊహించని విధంగా మృత్యువు ముంచుకొచ్చి ఐదు ప్రాణాలు బలి తీసుకోవడంతో బంధువులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు టోల్‌గేట్‌ వద్ద ఓ కారు ఇద్దరు పాదచారుల్ని ఢీకొట్టింది. ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. ఈ రెండు ఘటనలతో విషదఛాయలు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story