ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు..
X
కృతివెన్ను సమీపంలో మత్స్యకారులతో వెళ్తున్న వ్యాను కంటైనర్ లారీని ఢీకొంది

ఆంధ్రప్రదేశ్‌లోని కృతివెన్ను మండలం సీతనపల్లి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. మత్స్యకారులతో కృతివెన్ను వైపు వెళ్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. “చెక్క దుంగలు తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో మినీ లారీ కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


Tags

Next Story