కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
Road Accident in Kadapa: కడప జిల్లా బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident in Kadapa: కడప జిల్లా బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం అగ్రహారం వద్ద ఇన్నోవా కారు, మినీ లారీ ఢీకొనడంతో నలుగురు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్నాటకకు చెందిన వారిగా గుర్తించారు. ఎదురుగా వస్తున్న మినీ లారీ అతివేగంతో కారును ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలు కారులో ఇరుక్కుపోవడంతో స్థానికుల సహాయంతో వెలికి తీశారు.


Tags

Read MoreRead Less
Next Story