Lok Sabha MP : లోక్ సభ వృద్ధ ఎంపీ షఫీకర్ రహ్మాన్ కన్నుమూత
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బుర్కే కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ మొరాదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎస్పీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ షఫీకర్ రహ్మాన్ బుర్కే 2019లో ఐదోసారి కూడా ఎంపీగా ఎన్నికయ్యారు.
వయస్సు, అనుభవం రీత్యా అత్యంత సీనియర్ రాజకీయ నేతగానూ గుర్తింపు పొందారు. . ఆయన రాజకీయ ప్రయాణం 60 ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగింది. ఆయన మరణం పట్ల అఖిలేష్ యాదవ్ స్పందించారు. తమ పార్టీ సీనియర్ నేత, పలుమార్లు ఎంపీగా పనిచేసిన షఫీకుర్ రెహ్మాన్ బార్క్ సాహెబ్ మృతి బాధాకరమని వ్యక్తం చేశారు. గత నెల 30న ఎస్పీ రిలీజ్ చేసిన 16 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలోనూ షపీకర్ పేరు ఉండటం గమనార్హం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com