Sexual Assault on Minor : బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసు నమోదు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. భూపాలపల్లి వీఆర్ సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్ వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్‌తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు.
ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వీఆర్ సీఐగా బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సదరు మహిళ కూతురి(16)పై కన్నేశాడు. అదను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు.. సీఐ సంపత్‌పై అత్యాచారంతోపాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
భూపాలపల్లిలో సీఐగా పనిచేస్తున్న బండారి సంపత్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టి సదరు అధికారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మెడికల్ రిపోర్టులు వచ్చాక కేసులో పురోగతి ఉంటుంది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లయితే చట్టం పరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని సంజీవ్, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సీఐ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com