Sexual Harassment : విద్యార్థినులపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఆ పాఠశాలలో షీ టీమ్ సభ్యులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కారణంగా అతడి వ్యవహారం బయటపడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండల పరిధిలోని ఓ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాకలాన్ గ్రామానికి చెందిన గుండారం ప్రవీణ్ సదరు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం జిల్లా షీ టీమ్ సభ్యులు గుడ్ టచ్– బ్యాడ్ టచ్‌పై ఆ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. దాంతో ప్రవీణ్ లైంగిక వేధింపుల గురించి విద్యార్థినులు షీ టీమ్ దృష్టికి తీసుకొచ్చారు.
షీ టీమ్ సభ్యులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు ఆ పాఠశాలలో విచారణ జరిపి, సదరు ఉపాధ్యాయుడు ఇద్దరు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేల్చారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com