NCRB Report : రోజుకు 86 లైంగిక దాడులు.. ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు

NCRB Report : రోజుకు 86 లైంగిక దాడులు.. ఎన్సీఆర్బీ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు
X

దేశవ్యాప్తంగా అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మన దేశంలో 2017 నుంచి 2022 మధ్య సగటున ప్రతీరోజూ 86 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. చాలా కేసుల్లో మహిళలు తమకు తెలిసిన వారి నుంచే లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ లెక్కన చూస్తే ప్రతీ రోజూ నమోదవుతున్న 86 అత్యాచారాల్లో 52 మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే. మిగితా కేసుల్లో బాధితురాళ్ల వయసు 30 కన్నా ఎక్కువ ఉంటోంది.

వార్షిక నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం, 2017 - 2022 మధ్య భారతదేశంలో మొత్తం 1.89 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఇందులో 1.91 లక్షల మంది బాధితులు ఉన్నారు. కనీసం 1.79 లక్షల కేసుల్లో రేపిస్ట్ తెలిసిన వ్యక్తి కాగా, 9, 670 కేసుల్లో బాధితురాళ్లకు తెలియదు. భారతదేశంలో అత్యధికంగా అత్యాచార బాధితుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంది.

సగటున ప్రతీరోజు కనీసం ఒక మహిళ తన ఆఫీసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా ఎన్సీఆర్బీ డేటా చూపిస్తోంది. ఈ డేటా ప్రకారం ప్రతీ గంటకు నలుగురు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇందులో మూడు కంటే ఎక్కువ అత్యాచారాల్లో బాధిత మహిళలకు నిందితులు తెలుసు. తొలుత ఆఫీసు ప్రాంగణాల్లో లైంగిక వేధింపుల కేసులు చాలా తక్కువగా నమోదయ్యేవి. మిగత పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు అధికంగా ఉండేవి. 2014, 2015, 2016 సంవత్సరాల్లో యజమానులు, సహోద్యోగులు చేసిన అత్యాచారాల సంఖ్యను కూడా ఎన్సీఆర్బీ వెల్లడించింది. మూడేళ్ల కాలంలో యజమానులు, సహోద్యోగులచే జరిగిన 1,795 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

Tags

Next Story