Karnataka DGP Murder Case : కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో షాకింగ్ నిజాలు

కర్ణాటక మాజీ డీజీపీ హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ ను భార్య పల్లవి కట్టేసి కొట్టి, కారం చల్లి చంపినట్లు గుర్తించారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల కారణంగానే మాజీ డీజీపీని హత్య చేసినట్లు తెలిపారు. హత్యకు ముందు ప్రకాశ్ ను కట్టేసి, కారం చల్లి గాజు బాటిల్ తో పల్లవి కొట్టిందని పోలీసులు తెలిపారు. బెంగళూరులోని HSR లే అవుట్ లో ఓం ప్రకాశ్ రిటైర్డ్ లైఫ్ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దారుణ హత్యకు గురవడం సంచలనం రేపింది.
ఓం ప్రకాశ్ ను హత్య చేసిన భార్య పల్లవి ఆ తర్వాత మరో ఐపీఎస్ అధికారి భార్యకు వీడియోకాల్ చేసి రాక్షసుడిని చంపేశానని.. రక్తపు మడుగులో ఉన్న భర్త డెడ్ బాడీని పల్లవి చూపించినట్లు తెలుస్తోంది. తనను భర్త హత్య చేయడానికి ప్రయత్నించాడని అందుకే చంపేసినట్లు పల్లవి చెప్పింది. దీంతో పల్లవి ఆమె కూతురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర సంచలనంగా మారింది. బెంగళూరులోని HSR లేఅవుట్‌లోని తన నివాసంలో ఆయన హత్యకు ఉగరయ్యారు. నిన్న మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా… ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ హత్యకు, కుటుంబ తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పల్లవిని అన్ని కోణాల్లో విచారించారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com