Jharkhand : స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం

జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో తన భర్తతో కలిసి బైక్ టూర్‌కు వెళ్లిన స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దుమ్కాలోని హన్స్‌దిహా ప్రాంతంలో మార్చి 1న అర్థరాత్రి జంట తాత్కాలిక డేరాలో రాత్రి గడపడానికి నిర్జన ప్రదేశంలో ఆగినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి గ్యాంగ్‌రేప్ ఘటన జరిగిందని జర్ముండి సబ్ డివిజనల్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ జంట దుమ్కా మీదుగా బీహార్‌లోని భాగల్‌పూర్ వైపు వెళుతుండగా, డేరాలో రాత్రి గడపడానికి హన్స్‌దిహా మార్కెట్ దగ్గర ఆగింది. వారు ద్విచక్ర వాహనంపై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకుని బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం.
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డిన వారు జంటను కొట్టినట్టు కూడా తెలుస్తోంది. బాధితురాలికి ప్రస్తుతం దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com