TG : పింఛన్ డబ్బుల కోసం తల్లి హత్య

X
By - Manikanta |9 Aug 2024 2:50 PM IST
మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పింఛన్ డబ్బుల కోసం తల్లి దుర్గవ్వను(58) కుమారుడు రామచంద్రం హత్య చేశాడు. ఈ ఘటన నిజాంపేటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. తన తల్లి దుర్గవ్వతో కలిసి కుమారుడు రామచంద్రం ఒకే ఇంట్లో ఉంటున్నారు. పింఛన్ డబ్బులు ఇవ్వాలని పలుమార్లు తల్లిని కుమారుడు అడిగాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇద్దరు మధ్య గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో రామచంద్రం దుర్గవ్వను హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు రామచంద్రంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com