Jail : తల్లిపై దాడి చేసిన కొడుకుకు జైలు శిక్ష

తల్లిపై దాడి చేసి గాయపరిచిన కుమారుడికి ఏడాది జైలు శిక్ష, రూ. 3 వేల ఫైన్ విధిస్తూ కూకట్పల్లి 14వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరిగుట్ట పరిధి అంజయ్యనగర్కి చెందిన ఉమాదేవి(52)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా పెద్ద కొడుకు అనిల్కుమార్పెండ్లి చేసుకుని వేరే కాపురం పెట్టాడు.
అతడు కుటుంబ గొడవల కారణంగా తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. 2017 మే 29న అనిల్కుమార్తండ్రి వద్దకు వచ్చి ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేయడంతోపాటు అడ్డొచ్చిన తల్లిపై దాడి చేయగా.. తలకు,చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు రిపోర్ట్ ను కోర్టులో సమర్పించగా.. విచారణలో భాగంగా బుధవారం నిందితుడు అనిల్ కుమార్ కు జైలు శిక్షి, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com