Dogs : కుక్కల వల్ల ప్రాణాలు పోయినా పట్టించుకోరా

Dogs : కుక్కల వల్ల ప్రాణాలు పోయినా పట్టించుకోరా
X

మెండోరా మండల కేంద్రంలో ఓ పక్క కుక్కలు ఓ పక్క కోతులు ప్రజలు రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే కుక్కలు కోతుల భయంతో భయపడి చిన్న పిల్లల్ని ఒంటరిగా పంపాలంటే జంకుతున్నారు గ్రామాల్లో విపరీతంగా వీధి వీధిన కుక్కలు కోతులు సంచరిస్తున్నాయి ఇటీవల గ్రామంలో పలువురు పై దాడి చేసి గాయపరిచి ఇండ్లలోకి సైతం వస్తూ నానా హంగామా సృష్టిస్తున్నాయి ఇంటి ముందు కుక్కలు కనిపిస్తే హడలిపోతున్నారు కోతులు కుక్కలు రోడ్డుపై వెళ్లే వాహనదారులు వస్తున్న వారి వెంటపడుతున్నాయి వాటిని తప్పించుకునేందుకు వాహనం వేగం పెంచడంతో అదుపుతప్పి కింద పడిపోతున్నారు కొందరు వాహనదారులు వాపోతున్నారు రోజురోజుకు కోతులు కుక్కలు బేడద ఎక్కువ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుక్కలు మనుషులకి కాక పశువులను కూడా గాయపరుస్తూ ఇందులో పెంచుకున్న కోళ్లను వెంటపడి తింటున్నాయి కోతులు కుక్కలతో నిత్యం సమస్యలు ఎదురవుతుండడంతో ఇంటి ముందు కుక్కల కోసం కర్రలు పట్టుకుని యజమానులు కూర్చునే పరిస్థితి నెలకొంది

నిత్యం ఏదో ఒకచోట కుక్క దాడి లో గాయాలు

రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట కుక్కలు కోతులు దాడిలో గాయపడిన వార్తలు వింటూనే ఉంటున్నాం. అయినా కానీ కుక్కలు కోతులు గ్రామంలో సంచరిస్తున్నా కానీ గ్రామ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు నాడు మెండోర మండల కేంద్రంలో ఒకేరోజు 12 మంది తీవ్రంగా గాయపరిచి అంటే దీనిబట్టి తెలుస్తుంది అధికారుల నిర్లక్ష్యం ఎంతో ఉందొనని ప్రాణాలు పోతే గాని పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

Tags

Next Story