Suicide : అటెండెన్స్ తక్కువ అయిందని బాసరలో స్టూడెంట్ సూసైడ్

బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. RGUKT ఇన్‌స్టిట్యూట్‌లో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
ఏప్రిల్ 15 సోమవారం అర్ధరాత్రి వరకు తన స్నేహితులతో గడిపాడు ఆ విద్యార్థి. ఆ తర్వాతే.. విషాదం జరిగింది. ఉదయం ఈ సంఘటన బయటకు వచ్చింది. మృతుడికి 45 శాతం కంటే తక్కువ హాజరు ఉంది. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. ఇదే విషయమై అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసిన అధికారులు.. అతడిని ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. చాలా మందికి ఉండాల్సిన అటెండెన్స్ లేదని పోలీసులు తెలిపారు. అవమాన భారమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ RGUKT-బాసర అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను కోరారు. రీసెంట్ గా కూడా ఓ విషాద ఘటన జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com