Sri Chaitanya Hostel : శ్రీచైతన్య హాస్టల్‌లో రాత్రి పడుకుని తెల్లారేసరికి శవమైన విద్యార్థి

Sri Chaitanya Hostel : శ్రీచైతన్య హాస్టల్‌లో రాత్రి పడుకుని తెల్లారేసరికి శవమైన విద్యార్థి
X

హైదరాబాద్ శివారు కుత్భుల్లాపూర్ పరిధి కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ లో విషాదం నెలకొంది. 7 వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం రాత్రి భోజనం చేసి నిద్ర పోయిన విద్యార్థి.. ఉదయం నిద్ర లేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు కొంపల్లి శ్రీ చైతన్య K4 హాస్టల్ నిర్వాహకులు.

ఐతే.. అప్పటికే విద్యార్థి మల్లికార్జున్ మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. నిన్ననే విద్యార్థి అడ్మిషన్ అయినట్టు హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. పేట్ బషీరాబాద్ పీఎస్ లో జరిగిన సంఘటనపై హాస్టల్ వార్డన్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ ను బట్టి దర్యాప్తు చేస్తామన్నారు.

Tags

Next Story