Bribe : రూ.3లక్షల లంచం.. దొరికిపోయిన హాస్పిటల్ సూపరింటెండెంట్

Bribe : రూ.3లక్షల లంచం.. దొరికిపోయిన హాస్పిటల్ సూపరింటెండెంట్

అవినీతి నిరోధక బ్యూరో- ఏసీబీ (ACB) వలకు నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ దొరికారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ (Hospital Superintendent Lachunayak) రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసుల సాయంతో కేసు పెట్టారు

మెడిసిన్ టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి డీల్ మాట్లాడుకున్నారు సూపరింటెండెంట్ లచ్చునాయక్. రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపారి వెంకన్న విషయం ఏసీబీకి తెలిపారు. ఏసీబీ చెప్పిన ప్రకారం వల పన్నారు. ఫిబ్రవరి 16 శుక్రవారం తన ఇంట్లో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రికి రెండేళ్లుగా మందులు, మెడిసిన్ కిట్లు సరఫరా చేస్తున్నట్లు మెడికల్ వెండార్ వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్ 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్టు తెలిపారు. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి అవినీతి అధికారిని పట్టుకుంది.

Tags

Read MoreRead Less
Next Story