Commmit Suicide : భార్య కాపురానికి రావడం లేదని అత్త ఇంటికి అల్లుడి నిప్పు

భార్య కాపురానికి రావడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అత్త ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తానూ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ మృతి చెందాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది.
బల్మూరు మండలం గోదల్ గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డికి అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన రోషిత అలియాస్ లోహితలకు గత ఏడాది మే 31న వివాహమైంది. ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో యువతి తన తల్లి ఊరైన రంగాపూర్‌కు వచ్చింది. ఆదివారం సుభాష్‌రెడ్డి తన అత్త ఇంటికి వచ్చి తన భార్య ఏదని రోషిత చెల్లెలిని ప్రశ్నించాడు. అమ్మనాన్నలతో కలిసి పని కోసం వేరే ఊరికి వెళ్లిందని ఆమె చెప్పింది.
దీంతో ఆగ్రహించిన సుభాష్ రెడ్డి వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న సామాన్లపై చల్లి, తనమీద పోసుకొని నిప్పు అంటించాడు. మంటల్లో ఇల్లు మొత్తం కాలిబూడిదయ్యింది. తీవ్రంగా గాయపడిన సుభాష్‌రెడ్డి ఇంట్లోనుంచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. గ్రామస్థులు అతడిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు రోషిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత్తింటి వారే అల్లుడికి నిప్పుపెట్టి చంపేశారని సుభాష్‌రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com