Thefts : ఇండ్లలో చోరీలు .. ఇద్దరు అరెస్ట్
ఇండ్లలో చోరీలు చేస్తున్న ముఠాను హసన్పర్తి పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం హసన్పర్తి సీఐ జువ్వాది సురేశ్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం నల్లగట్టు గుట్ట వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో ఇద్దరు వ్యక్తులు ఆటోలో అటువైపు వచ్చారు. పోలీసులు ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా వారు ఆపకుండా వెళ్లిపోయారు.
దీంతో పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని విచారించగా హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోరీలు, ఎల్కతుర్తి పరిధిలో ఓ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని పాలకుర్తికి చెందిన సోలంకి రాజారాం, హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్టకు చెందిన సోలంకి చవాన్ రాజుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువైన 18 తులాల బంగారం, 40 తులాల వెండి, ఓ ఆటో, ఎల్ఈడీ టీవీ, 32 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
వీరు ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి టైంలో ఇండ్లలోకి చొరబడి మొబైల్స్, విలువైన వస్తువు లు చోరీలు చేస్తుంటారని సీఐ చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. క్రైమ్ కానిస్టేబుల్ క్రాంతికుమార్, మధు, మధుకర్ రె డ్డి, ఐడీ అసిస్టెంట్ సల్మాన్ పాషా, నగేశను సీఐ అభినందించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com