TS : దొంగకు దేహశుద్ధి.. స్పాట్ డెడ్

TS : దొంగకు దేహశుద్ధి.. స్పాట్ డెడ్
X

నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని కాలనీవాసులు పట్టుకొని కొట్టి చంపారు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో తగిలేపల్లి గ్రామానికి చెందిన మైదం నారాయణ (40) అదే గ్రామంలో బీసీ కాలనీలో ఒక వ్యక్తి ఇంటికి దొంగతనం చేయటానికి వెళ్లాడు.

గమనించిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారిని పిలిచి నారాయణను దేహశుద్ధి చేశారు. శుక్రవారం తెల్లవారుజామున విషయం గమనించిన కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న నారాయణ ను ఇంటికి తీసుకువెళ్లి సపర్యలు చేశారు.

ఐదు నిమిషాల్లోపే నారాయణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సీఐ జేఎస్ రెడ్డి , ఎస్సై కృష్ణ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి పంచనామా నిర్వహించి విచారణ చేపట్టారు.

Tags

Next Story