Tragedy at Bogatha Waterfalls : బొగత జలపాతం లోయలో పడి ఒకరు మృతి

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చిరుపల్లి బొగత జలపాతం లోయలో పడి యువకుడు మృతిచెందాడు. వరంగల్ జిల్లా ఏను మాముల మార్కెట్ సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన బొనగాని జస్వంత్ (19) అనే యువకుడు తన తోటి మిత్రులైన సాయి కిరణ్, నాగేంద్ర, సుశాంత్ వంశీ గౌస్ కలిసి చీకుపల్లి బొగతను సందర్శించడానికి వెళ్లారు.
బొగత అందాలను తిలకించిన వీరు బొగతలో స్నానం చేసేందుకు దిగారు. వర్ద ఉధృతి ఎక్కువగా ఉండడంతో జస్వంత్ నీటమునిగి గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ బండార్ కుమార్, వెంకటా పురం ఎస్ఐ తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా యువకుడి మృతదేహం లభ్యమైంది.
జస్వంత్ వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. తోటి మిత్రులతో కలిసివచ్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com