కళ్ల ముందే కన్నతండ్రి మరణం

కళ్ల ముందే కన్నతండ్రి మరణం

కళ్ల ముందే కన్న తండ్రి తలపై నుంచి ట్రాక్టర్ వెళ్లడం, తలపగిలి విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదలడాన్ని చూసిన ఆ కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాన్న లే అంటూ చేస్తున్న రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ద్విచక్ర వాహనంపై కూతురిని కళాశాలలో దింపడం కోసం తీసుకెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్ధులు, ఎస్పై గోదారి రాజ్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

దండేపల్లి గ్రామానికి చెందిన వర్ధిల్లి పురుషోత్తమావు (46) - శైలజా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. పెద్ద కుమార్తె స్మరణ హసన్పర్తి శివారులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్, రెండో కుమార్తె స్పందన ఆదే కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు కుమార్తెలను ప్రతీరోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి తిరిగి తీసుకుని వస్తాడు. గురువారం చిన్న కూతురు స్పందనకు పరీక్షలు ఉండడంతో ఆమెను కళాశాలలో దింపడం కోసం ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన ట్రాక్టర్ ఇసుక లోడ్తో బావుపేట వైపు వస్తోంది. వెనుక నుంచి ట్రాక్టర్ రాకను గమనించిన పురుషోత్తంరావు తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు.

ద్విచక్ర వాహనాన్ని దాటే క్రమంలో ట్రాక్టర్ ముందు భాగం పురుషోత్తంరావుకు తగలడంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న కూతురు స్పందన పొలాల్లో పడిపోగా పురుషోత్తంరావు రోడ్డుపై పడ్డాడు. దీంతో ట్రాక్టర్ టైరు తలపై నుంచి వెళ్ల డంతో హెల్మెట్ సైతం నుజ్జునుజ్జె తల పగిలి పురుషోత్తంరావు అక్కడి కక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలు సుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుసంఘటన స్థలంలో మృతదేహంపై పడి రోదిస్తున్న కుటుంబ సభ్యులున్నారు. తండ్రి మృతదేహంపై కూతుళ్లు పడి రోదిస్తున్న రోదనలు మిన్నం టాయి. సంఘటన వద్దకు వచ్చిన గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story