ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని బాలిక మృతి

ఫ్రిజ్‌లో పెట్టిన చికెన్ కర్రీ తిని బాలిక మృతి

నిన్నటి చికెన్ కర్రీ తిని తమిళనాడులో ఓ బాలిక చనిపోయింది. చికెన్ కర్రీని ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి తిన్న బాలిక ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడు, అరియలూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అరియలూరు జిల్లాలోని జయంగొండం సమీపంలోని గ్రామానికి చెందిన గోవిందరాజులు - అన్బరసి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఘటన జరిగిన రోజు గోవిందరాజులు తాను నిర్మించనున్న కొత్త ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

కుటుంబ సమేతంగా గుడికి వెళ్లి మొక్కు చెల్లించుకుని ఇంటికి కోడి మాసం తీసుకొచ్చారు. ఇంట్లో వండిపెట్టారు. మిగిలిన చికెన్ పులుసును ఫ్రిడ్జిలో ఉంచి మరుసటి రోజు తిన్నారు. ఆ సమయంలో పాత కూర గ్రేవీని ఏడో తరగతి చదువుతున్న చిన్న కూతురు లిథిర తిన్నది. ఆ వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది.

బాలికను జయంగొండం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించినా ఫలితం కనిపించలేదు. చికిత్స పొందుతూ బాలిక ప్రాణాలు కోల్పోయింది. అదే కోడి కూర పులుసు తిన్న తండ్రి గోవిందరాజులు, తల్లి అన్బరసి, సోదరి ద్వారక కూడా అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. అది పాడైపోవడం.. ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బాలిక మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story