Suicide : ప్రియురాలికి నిశ్చితార్థం.. ప్రియుడు సూసైడ్

X
By - Manikanta |8 May 2024 11:19 AM IST
ప్రేమించిన అమ్మాయి కి వేరే వ్యక్తితో నిశ్చితార్ధం కావడంతో ప్రియుడు సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మనోహరాబాదమండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐకరు ణాకర్ రెడ్డి కథనం ప్రకారం... మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సోహెల్(24) ఆటో డ్రైవర్. మూడు సంవత్సరాల నుంచి ఒక యువతిని ప్రే మిస్తున్నాడు. కాగా ఆ అమ్మాయి ఇంట్లో సోహెల్ పెళ్లి గురించి చెప్పగా ఒప్పుకోలేదు. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్ధం కావడంతో మనస్తాపం చెందిన సోహెల్ సోమవారం రాత్రి 11 గంటలకు ఇంట్లో శాలువాతో ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయా డు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. డెడ్ బాడీని పోస్టు మార్ఖం కోసం తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్ కుతరలించారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com