ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

పాట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అందరూ రోడ్డుపక్కన ఆగిపోయిన వాహనానికి మరమ్మత్తులు చేస్తున్నారు ఆ సమయంలో వెనుక నుండి వచ్చిన వాహనం వారిని ఢీ కొట్టింది . ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. పాలిగంజ్ సబ్ డివిజన్‌లోని రాణితలాంబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 139లోని సైదాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం వాహనాన్ని, మృతదేహాల్ని జేసీబీ సాయంతో వాహనం బయటకు తీశారు.

ప్రస్తుతం ఇద్దరు మృతులను గుర్తించారు. ఇందులో సీతామర్హిలోని లగ్న దుమ్రా నివాసి జగేశ్వర్ దాస్ కుమారుడు ఇందల్ దాస్, మరొకరు రాణిత్లాబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోర్వ మథియాలో నివాసం ఉంటున్న సుఖ్‌దేవ్ యాదవ్ కుమారుడు అజిత్ కుమార్‌గా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. మృతుల్లో మరో ముగ్గురిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంతమంది ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం ఇంకా అందలేదు. కాగా, యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ వాహనంతో పరారీ అయ్యాడు. అతని గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు.

తదుపరి ప్రక్రియ కొనసాగుతోందని రాణితలాబ్ పోలీస్ స్టేషన్ (Ranitalaamb police station) ఇంఛార్జి దుర్గేష్ కుమార్ (durgesh kumar) గెహ్లాట్ తెలిపారు. సమాచారం ప్రకారం, సంఘటన సమయంలో మృతులు పాడైన తమ వాహనాన్ని రిపేర్ చేస్తున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దీని ద్వారా గుర్తుతెలియని వాహనం గురించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు

Tags

Read MoreRead Less
Next Story