Suicide : కులాలు వేరని పెండ్లికి ఒప్పుకోలే ప్రేమజంట ఆత్మహత్య
కులాలు వేరని పెద్దలు పెండ్లికి ఒప్పుకోకపోవడంతో క్షణికావేశంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలంలోని తుమ్మల పెన్ పహాడ్ గ్రామానికి చెందిన గుండగాని సంజయ్(25) సూర్యాపేటలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన సళ్ళగుండా నాగజ్యోతి(21) ఫార్మసీ చదివి హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తోంది. వీరిద్దరూ ఐదేండ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరుపక్షాల పెద్దలు పెండ్లికి ఒప్పుకోలేదు. అంతేగాకుండా అమ్మాయి జోలికి రావొద్దని సంజయ్‌ని మందలించారు. నాగలక్ష్మి ఉగాది సందర్భంగా గ్రామానికి రాగా..ఇద్దరూ కలుసుకున్నారు. ఇది తెలుసుకున్న నాగజ్యోతి కుటుంబసభ్యులు సంజయ్‌తో గొడవ పడ్డారు. దీంతో తమ పెండ్లి జరగదని ఆవేదన చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
రాత్రి గ్రామ శివారులో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయం మృతదేహాలను చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డెడ్‌బాడీలను పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఇరు కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com