Tinder App : టిండర్ యాప్లో యువకులను ట్రాప్..

Tinder App : టిండర్ యాప్లో యువకులను ట్రాప్..
X

టిండర్ యాప్లో ( Tinder App ) యువకులను ట్రాప్ చేసి మోసం చేస్తున్న యువతుల బాగోతం భయటపడింది. పబ్బు యజమానులు, యువతులు కలిసి డేటింగ్ యాప్స్ ద్వారా మోసం చేస్తున్న ఘటన హైటెక్ సిటీలో చోటుచేసుకుంది. యువకులను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు పబ్ యజమానులు, యువతులు. టిండర్ యాప్ లో యువకులతో కనెక్ట్ అయి.. పబ్ లో మీట్ అవుదామని ఇన్వైట్ చేస్తున్నారు యువతులు.

ఓ యువకుడిను పబ్ లోకి తీసుకువెళ్లిన తర్వాత లిక్కర్ ఆర్డర్ చేసింది రితిక అనే యువతి. రూ. 45 వేల బిల్లను చేతిలో పెట్టి చల్లగా జారుకుంది రితిక. దీంతో బిల్లును చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు యువకుడు. పబ్బు యజమానులు, యువతి కలిసి తనను మోసం చేశారని యువకుడు గ్రహించాడు. లిక్కర్ పేరుతో యువతికి కోక్ ఇచ్చి రూ.45 వేల బిల్ వేశారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసమని మోసం చేస్తున్నారని గుర్తించాడు యువకుడు. తన లాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది అబ్బాయిలు మోసపోయి పోయినట్లు గుర్తించాడు. తనకు జరిగిన మోసం పైన యువకుడు సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయటపెట్టాడు వ్యాపారవేత్త. డబ్బులు కట్టకపోతే పబ్ యజమానులు బలవంతంగా బాధితులను బెదిరించి డబ్బులు కట్టిస్తున్నారని తెలిపాడు.

Tags

Next Story