Vijayawada: రాహుల్ హత్యకేసులో కొత్త ట్విస్ట్

Rahul Murder Case: విజయవాడలో పారిశ్రామికవేత్త రాహుల్ హత్యకేసులో కొత్త కోణం బయటికొచ్చింది. ఆరు కోట్ల వివాదంలో మాట్లాకుందాం రమ్మని గాయత్రికి రాహుల్ ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.. అయితే, ఆ సమాచారాన్ని గాయత్రి కోరాడకు అందజేసింది.. హత్య జరిగిన ప్రదేశం రాహుల్, కోరాడ, గాయత్రి తరచూ కలిసే ప్రదేశంగా పోలీసుల విచారణలో తేలింది.. ఇంటి నుంచి రెగ్యులర్ స్పాట్‌కు వచ్చిన రాహుల్‌ను.. అక్కడ్నుంచి దుర్గ కళా మందిర్ థియేటర్‌కు తీసుకెళ్లాడు కోరాడ విజయ్.. అక్కడే రాహుల్‌ను చిత్రహింసలు పెట్టి ఫ్యాక్టరీ ప్రాపర్టీని కోరాడ, కోగంటి సత్యం బలవంతంగా తమ పేరు మీద రాయించుకున్నట్లు సమాచారం.
ఆ తర్వాత రాహుల్‌ను కారులో తిప్పి చివరకు డీవీ మ్యానర్ పక్కనే వున్న సందులోకి తీసుకెళ్లారు.. అప్పటికే కోరాడతోపాటు బాబూరావు, సీతయ్య, మరో ముగ్గురు కోరాడ అనుచరులు అక్కడికొచ్చారు. కారులో రాహుల్ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.. రాహుల్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత కారు లాక్ చేసి కీస్ తీసుకెళ్లారు.. ఇక ఈ కేసులో కాల్ డేటాతోపాటు సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది.. రేపు కోరాడ, సీతయ్య, బాబూరావును కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అటు రాహుల్ హత్యకేసుపై రేపు పోలీసులు మీడియా ముందు అన్ని వివరాలు వెల్లడించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com