Rape Case : మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్

Rape Case : మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్ట్
X

మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం వివరాలు వెల్లడించారు. కుటుంబ కలహాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 12న శుక్రవారం ఓ మహిళ ఆటోలో అల్వాల్ పీఎస్ కు వెళ్లింది. అక్కడ ఫిర్యాదు చేసి తిరిగి యాప్రాల్ లోని ఇంటికి అదే ఆటోలో బయలుదేరింది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఆటో డ్రైవర్ మహిళతో మాటలు కలిపాడు. లోతుకుంటలోని ఓ వైన్స్ వద్ద ఆటో ఆపి మద్యం తాగాడు. అదే టైమ్ లో మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కారు. మహిళకు బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆటోను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లారు. మహిళను కారులో ఎక్కించారు. సికింద్రాబాద్, సుచిత్ర, అల్వాల్ ప్రాంతాల్లో కారును తిప్పుతూ అందులోనే ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున వారి నుంచి తప్పించుకున్న మహిళ స్థానికుల సాయంతో డయల్ 100కు కాల్ చేసి పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీసులు ఆమెను పీఎస్ కు తీసుకెళ్లారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు అల్వాల్ పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాయికిరణ్​ తో పాటు అతడికి సహకరించిన సలీంను అరెస్ట్ చేసినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story