Suicide : వేధింపులు తట్టుకోలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

Suicide : వేధింపులు తట్టుకోలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం

మాజీ హెచ్‌ఎంతో పాటు తోటి ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు దోమల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట ప్రభుత్వ మోడల్‌స్కూల్‌లో బుధవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత ఉపాధ్యాయురాలు హారిక తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. ‘పాఠశాలకు చెందిన మాజీ ప్రిన్సిపాల్‌, టీజీటీ సివిక్స్‌ ఉపాధ్యాయుడు రాజేందర్‌, సహచర ఉపాధ్యాయులు డి.రాజు, మౌలాలి, సోషల్‌ ఉపాధ్యాయురాలు అంతా బృందంగా ఏర్పడి నన్ను టార్గెట్‌ చేసి వేధింపులకు గురిచేస్తున్నారు.

రాజేందర్‌ స్కూల్‌లో నన్ను అసభ్యకరంగా ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తున్నారు. రాజేందర్‌ వేధింపులు తాళలేక పలువురు మహిళా టీచర్లు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారమిచ్చే నిమిత్తమై క్లాస్‌లో సెల్‌ఫోన్‌ తీయగా.. రాజేందర్‌ వీడియో తీసి, క్లాసులో ఫోన్‌ వినియోగిస్తున్నానని మీడియాకు సమాచారమిచ్చారు.

15 రోజుల క్రితమే ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ స్థానంలో సదాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. అయినా నాపై కోపం పెంచుకున్న రాజేందర్‌.. తోటి టీచర్లతో కలిసి మరింతగా వేధించసాగారు’ అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ నోడల్‌ అధికారి స్కూల్‌ను సందర్శించి వివరాలు సేకరించారు. దీనిపై రాజేందర్‌ను వివరణ కోరగా.. తాను హారికను వేధించలేదని.. ఆమె నిరాధార ఆరోపణలు చేస్తోందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story