Wife Killed Husaband : భర్త పడుకుని ఉండగా అక్కడ వేడినీళ్లు పోసి చంపిన భార్య

Wife Killed Husaband : భర్త పడుకుని ఉండగా అక్కడ వేడినీళ్లు పోసి చంపిన భార్య
X

కొన్ని నేరాలు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జనాల్లో క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోవడంతో ఘోరాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో దారుణం జరిగింది.

భర్తను భార్య కట్టేసి కొట్టి చంపిన ఘటన కరీంనగర్ పట్టణం సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. 3 టౌన్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. తరచూ గొడవ పడుతున్నాడన్న నెపంతో భర్త హేమంత్ ని చంపింది భార్య రోహితి.

పడుకున్న భర్తపై ప్రైవేట్ పార్ట్స్ పై వేడి నీళ్లు పోసింది భార్య రోహితి. ఆ తర్వాత బాగా కొట్టింది. తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిన తర్వాత భర్త హేమంత్ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందాడు. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తోంది రోహితి.

Tags

Next Story