Fake Rape Scene : యువతిని హత్య చేసి.. రేప్ సీన్ క్రియేట్ చేసిన కి‘లేడీ’

యువతిని హత్య చేసి.. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు హత్యాచారం జరిగినట్టు రేప్ సీన్ క్రియేట్ చేసిన కిలాడీ లేడీని కూకట్‌పల్లి పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. గత నెల 30న దారుణహత్యకు గురైన ప్రియాంక(20) కేసును పోలీసులు ఛేదించారు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ వెల్లడించారు. బోధన్ యేడేపల్లి గ్రామానికి చెందిన ప్రియాంక హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఉంటూ.. రాత్రిళ్లు ఫుట్‌పాత్‌పై నిద్రించేది. ఆ సమయంలో ఆమెకు మంజుల అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఫుట్‌పాత్‌పై ఉంటున్న తనకు భద్రత లేదని తన వెండి ఆభరణాలు మంజుల వద్ద భద్రపరిచింది. కొద్ది రోజుల తర్వాత తన వెండి ఆభరణాలు తిరిగి ఇవ్వాలని కోరగా.. మంజుల ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతు చూస్తానని బెదిరించి వెండి ఆభరణాలు తిరిగి తీసుకుంది. తనకు ప్రియాంకతో ప్రాణహాని ఉందని భావించిన మంజుల.. ఆమెకు సెప్టెంబరు 30న మద్యం తాగించి కేపీహెచ్‌బీ లోధా అపార్ట్‌మెంట్ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి బ్లేడుతో గొంతుకోసి హత మార్చింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రియాంకను ఎవరో రేప్ చేసి హత్య చేసినట్టుగా సీన్ క్రియేట్ చేసి అక్కడి నుంచి పరారైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com