TS : చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్ ఆరు తులాల బంగారం స్వాధీనం

ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఓ మహిళను సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ గత నెల 18న కోదాడ బస్టాండ్‌కు వచ్చింది. ఆ టైంలో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కోదాడ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు.
కాగా బుధవారం ఓ మహిళ కోదాడ పట్టణంలోని బంగారం షాపుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రంజిత్‌రెడ్డి ఆమెను అదుపులోకి తీసుకొని ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలం బుడంగుంట గ్రామానికి చెందిన కర్రెద్దుల లలితగా గుర్తించారు. ఆమెను విచారించడంతో గత నెల 18న కోదాడ బస్టాండ్‌లో దొంగిలించిన ఆభరణాలను అమ్మేందుకు వచ్చినట్లు అంగీకరించింది.
చంద్రహారం, రెండు జతల చెవి దిద్దులు, ముక్కు పుడక, బంగారు ఉంగరంతో పాటు, రూ. 30 వేలు స్వాధీనం చేసుకొని మహిళను అరెస్ట్ చేసినట్లు కోదాడ సీఐ టి.రాము చెప్పారు. నిందితురాలిపై గతంలో 50కి పైగా కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లి బయటకు వచ్చినట్లు సీఐ తెలిపారు. నిందితురాలిని పట్టుకున్న ఎస్సై రంజిత్‌రెడ్డి, సిబ్బంది సతీశ్, యల్లారెడ్డిని సీఐ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com