Lift Wire : లిఫ్ట్ వైర్ తెగి పడి కార్మికుడు మృతి

మెటీరియల్ లిఫ్ట్‌వైర్ తెగి పడి ఓ కార్మికుడు మృతిచెందాడు. బాచుపల్లి పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. బాచుపల్లి కౌలస్య కాలనీలో డాల్ఫిన్కన్స్ట్రక్షన్అపార్ట్మెంట్ నిర్మిస్తోంది. మెదక్‌జిల్లాకు చెందిన రాములు(56) కార్మికుడిగా పని చేస్తున్నాడు. బుధవారం క్రేన్‌తో మెటిరియల్లిఫ్ట్ చేస్తుండగా క్రేన్వైరు తెగి కార్మికుడిపై పడింది. దీంతో రాములు స్పాట్ లో మృతి చెందాడు. క్రేన్‌పై కరెంట్ తీగలు పడడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడగా.. అనంతరం విద్యుత్ అధికారులు పునరుద్ధరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డాల్ఫిన్ కన్స్ట్రక్షన్ నిర్వాహకులు తగు రక్షణ చర్యలు పాటించకపోవడంతోనే కార్మికుడు మృతిచెందాడని నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీశ్ఆరోపించారు. మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని,బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com