Suicide : ప్రేమ విఫలమై యువకుడి సూసైడ్

ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లక్సెట్టిపేట మండలం చందారం గ్రామానికి చెందిన దేశరాజుల రామాంజనేయులు తన భార్య, కొడుకు సంతోష్(20)తో కలిసి అత్తగారిల్లు అయిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లికి చెందిన మూడు రోజుల కింద వచ్చాడు. బుధవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న టైంలో సంతోష్ పక్క గదిలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి కిందకు దించగా అప్పటికే చనిపోయాడు.
సంతోష్ కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఈ విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడగా, తమ కూతురికి ఇప్పుడే పెండ్లి చేసే ఉద్దేశం లేదని, చదివిస్తామని చెప్పినట్లు సంతోష్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కొద్ది రోజులుగా మనోవేదనతో ఉన్న సంతోష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న తాళ్ల గురిజాల ఎస్సై నరేశ్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com