Jawan : ప్రేమకు బలైన యువజవాన్

X
By - Manikanta |25 Jun 2024 11:13 AM IST
వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుంట చింటూ (20) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు ఆర్మీ జవాన్ కుంట చింటూ. తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
2023లో ఇండియన్ ఆర్మీలో సెలక్టై బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్నాడు చింటు.
గుజరాత్ లో ఉద్యోగంలో జాయిన్ కావలసి ఉండగా.. సెలవుపై గ్రామానికి వచ్చాడు జవాన్. తన ప్రేమను యువతి ఒప్పుకోకపోవడంతో చింటు సొంత ఊరిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టంత కొడుకు చేతి కంది ప్రేమకు బలైపోవడంతో తల్లిదండ్రులు, ఐనవారి బాధకు అంతులేకుండా పోయింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com