Young Woman Missing : ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి వెళ్లిన యువతి మిస్సింగ్

ఆఫీసులో మీటింగ్ ఉందని చెప్పి వెళ్లిన యువతి మిస్సింగ్ అయింది. లాలాగూడ పోలీసులు తెలిపిన ప్రకారం.. నార్త్ లాలాగూడలోని నూరి పాన్ షాప్ సమీపంలో ఉండే మీర్జా రసూల్ బేగం చిన్న కూతురు శిరీన్ బేగం(27) నానక్ రామ్ గూడ ల్యాంకో హిల్స్ లోని యాక్సెంచర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తుంది. ఈనెల18న ఉదయం 9 గంటలకు ఆఫీస్ లో మీటింగ్ ఉందని చెప్పి, ల్యాప్ టాప్ తీసుకుని వెళ్లింది. తిరిగి రాకపోగా కుటుంబసభ్యులు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అదేరోజు సాయంత్రం 7.20 గంటలకు పెండ్లి చేసుకుంటున్నానని శిరీన్ బేగం తన సోదరుడు మీర్జా సాజిత్ బేగ్ కు మెసేజ్ పంపింది. వెంటనే శిరీన్ బేగంకు ఫోన్ చేయగా అందుబాటులో రాలేదు. ఆమె తన స్టడీ సర్టిఫికెట్లు కూడా వెంట తీసుకెళ్లిందని కుటుంబసభ్యులు గుర్తించారు. బంధువులు, ఫ్రెండ్స్ వద్ద ఆమె గురించి ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com