TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల టైమ్

TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల టైమ్
X

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న మలయప్పస్వామిని 65,656 మంది దర్శించుకోగా, 24,360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. అటు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.

Tags

Next Story