TTD : శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

TTD : శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం
X

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు వేంకటేశ్వరుడి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,007 మంది భక్తులు దర్శించుకోగా.. 27,440 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి హుండీ ఆదాయం రూ.3.04కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉ.5.30 గంటలకే బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకొని సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో శ్రీవారి దర్శన టోకెన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.

Tags

Next Story